: వృద్ధ అరబ్ షేక్ ఎత్తుగడలకు పోలీసుల చెక్!


అమాయక బాలికను వివాహం చేసుకుని తన పబ్బం గడుపుకోవాలని ఆ అరబ్ షేక్ వేసిన ఎత్తును హైదరాబాద్ పోలీసులు చిత్తు చేశారు. ఈ ఘటన పాతబస్తీలో జరిగింది. ఓ పేద ముస్లిం కుటుంబాన్ని ట్రాప్ చేసిన ఒమన్ వాసి షేక్ మహ్మద్ డబ్బులిచ్చి వాళ్ల అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించాడు. హైదరాబాద్ వచ్చి ఓ బ్రోకర్ సాయంతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అరబ్ షేక్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ఈ తతంగం వెనకున్న బ్రోకర్లు ఎవరన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News