: 'బరాక్-8' మిస్సైల్ వచ్చేస్తోంది!


ఇండియా, ఇజ్రాయిల్ దేశాలు కలిసి, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక 'బరాక్-8' క్షిపణిని ఈ నెలాఖరులో పరీక్షించనున్నారు. శత్రుదేశపు క్షిపణులు, విమానాలు, డ్రోన్ల నుంచి యుద్ధ నౌకలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బరాక్ క్షిపణుల తయారీని ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బరాక్ శ్రేణిలో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నది 8వ తరం క్షిపణి. ఇజ్రాయిల్ లో క్షిపణి పరీక్షలు జరగనుండగా, అవి విజయవంతమైతే, సెప్టెంబరులో భారత జలాల్లో యుద్ధనౌకపై నుంచి 'బరాక్-8'కు తుది పరీక్షలు జరపాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన.

  • Loading...

More Telugu News