: మాకూ ఎయిమ్స్ స్థాయి వేతనాలివ్వాల్సిందే... ఆందోళనకు దిగిన నిమ్స్ వైద్యులు


హైదరాబాదులోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు ఆందోళన బాట పట్టారు. నేటి ఉదయం నిమ్స్ కు చెందిన బోధనా సిబ్బంది గంట పాటు విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపారు. ప్రమోషన్ల విషయంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న తమకు ఎయిమ్స్ స్థాయి వేతనాలు ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతుల్లో పాత పద్ధతులను అనుసరించాలని డిమాండ్ చేస్తున్న వైద్యులు, నిమ్స్ యాజమాన్యం స్పందించని పక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News