: పేరు మ్యాగీనే, ప్రొడక్ట్ మాత్రం కొత్తది... రూటు మార్చిన నెస్లే!


సుమారు మూడు దశాబ్దాల తరువాత తొలిసారిగా నష్టాలను చవి చూసిన నెస్లే, భారత మార్కెట్లో తిరిగి సత్తా చాటడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా ప్రజలకు సుపరిచితమైన 'మ్యాగీ' బ్రాండ్ పేరును అలాగే ఉంచి, సరికొత్త ప్రొడక్టులను విడుదల చేయనున్నట్టు నెస్లే కొత్త ఎండీ సురేష్ నారాయణన్ చెబుతున్నారు. రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన నెస్లే అభివృద్ధికి ఐదు సూత్రాల అజెండాను ప్రకటించారు. మ్యాగీకి పూర్వవైభవం తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. కాగా, గత సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో రూ. 287 కోట్ల లాభాలను అందుకున్న సంస్థ ఈ సంవత్సరం రూ. 64 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

  • Loading...

More Telugu News