: టెక్నీషియన్ల సహాయ నిరాకరణ... నిలిచిపోనున్న తెలుగు సీరియళ్ల షూటింగ్
తెలుగు టీవీ సీరియళ్ల షూటింగుకు నేడు బ్రేక్ పడనుంది. వేళాపాళా లేని పనివేళలు, చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్న తెలుగు టెలివిజన్ సాంకేతిక నిపుణులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు తెలుగు టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేటి నుంచి నిరసన బాట పట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాక, తమ డిమాండ్లు నెరవేరేదాకా విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పింది. టెక్నీషియన్స్ సమ్మె బాట నేపథ్యంలో నేడు తెలుగు టీవీ సీరియళ్ల షూటింగ్ నిలిచిపోక తప్పని పరిస్థితి నెలకొంది.