: తేనీరు కోసం గొడవ... వ్యక్తి గొంతును అద్దంతో కోసేసిన వైనం


కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో నేటి ఉదయం ఓ చిన్న వివాదం పెను ఘర్షణకు దారి తీసింది. తేనీటి (టీ) కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం గొంతులు కోసుకునేదాకా వెళ్లింది. టీ కొట్టు వద్ద చోటుచేసుకున్న మాటల యుద్ధంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి చేతికందిన అద్దం ముక్కతో తనతో గొడవపడ్డ వ్యక్తి గొంతు కోశాడు. ఈ దాడిలో బాధిత వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News