: మా ఆయన నడిచే దేవుడు!... మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య కామెంట్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో అడ్డంగా బుక్కై, సుదీర్ఘ కాలం తర్వాత ఆ వివాదం నుంచి క్లీన్ చిట్ పొందిన క్రికెటర్ శ్రీశాంత్ పై అతడి భార్య భువనేశ్వరి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీశాంత్ నడిచే దేవుడని ఆమె వ్యాఖ్యానించింది. శ్రీశాంత్ లోని దూకుడు స్వభావాన్నే అందరూ చూస్తారని బాధపడ్డ ఆమె, అతడిలోని నిజమైన మనిషిని చూడటం లేదని వాపోయింది. ‘‘శ్రీశాంత్ పై మోపిన అభియోగాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని నాకు తెలుసు. భగవంతుడు దిగివచ్చి అతడు తప్పు చేశాడని చెప్పినా నేను నమ్మను. నేను చూసిన వారిలో శ్రీ అద్భుతమైన వ్యక్తి. అతడు నడిచే దైవమన్నది నా నమ్మకం. ప్రజలు శ్రీలోని నిజమైన పార్శ్వాన్ని చూడటం లేదు’’ అని ఆమె పేర్కొంది.