: 'రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ' ఏర్పాటు
తెలంగాణలో స్థిరపడ్డ రాయలసీమ వాసుల కోసం 'రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ' ఏర్పాటయింది. ఈ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని ఎన్నుకున్నారు. హైదరాబాదులో జరిగిన ఓ సమావేశంలో రాయలసీమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో రాయలసీమ వారే ఎక్కువగా స్థిరపడ్డారని... ఈ నేపథ్యంలో, వారి సంక్షేమం, బాగోగుల కోసం తాము పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హన్మంతరెడ్డి కూడా హాజరయ్యారు.