: అమర్ నాథ్ యాత్రకు బయల్దేరిన మరో బృందం
పవిత్ర అమర్ నాథ్ యాత్రకు మరో భక్త బృందం బయల్దేరింది. 342 మంది పురుషులు, 96 మంది మహిళలు, ఆరుగురు పిల్లలతో కూడిన 444 మంది బృందం ఈ ఉదయం తెల్లవారుజామున అమర్ నాథ్ కు తరలి వెళ్లారు. సీఆర్పీఎఫ్ దళాల భారీ భద్రత మధ్య భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి వీరంతా బయల్దేరారు. ఈవేళ బయల్దేరిన బృందంతో కలసి అమర్ నాథ్ యాత్రకు ఇప్పటిదాకా వెళ్లిన వారి సంఖ్య 45,886కు చేరింది.