: ఏపీని బీహార్ తో కలిపి చూడలేం... న్యాయం చేస్తాం: ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్
ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి ఇందర్ జిత్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు ముగింపు పలికేందుకు మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యత్నించారు. ఇందర్ జిత్ సింగ్ కేవలం బీహార్ ను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశారని... ఆ వ్యాఖ్యలకు, ఏపీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేరుస్తుందని ఆమె చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణకు కూడా అన్యాయం చేయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.