: సత్య నాదెళ్లకు బహిరంగ లేఖ రాసిన 'మొజిల్లా' సీఈవో
మైక్రోసాఫ్ట్ ఇటీవల విడుదల చేసిన విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్ కు కొద్దిరోజులకే మంచి ఆదరణ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 14 మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే, అదే స్థాయిలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. యూజర్ కంట్రోల్స్ సరిగా పనిచేయడం లేదని అనేక మంది కస్టమర్ కేర్ సెంటర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ జాబితాలో 'మొజిల్లా' సీఈవో క్రిస్ బియర్డ్ కూడా చేరారు. యూజర్ కంట్రోల్స్ సమస్యపై ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు బహిరంగ లేఖ రాశారు. లోపాలను తన బ్లాగులో వెల్లడించారు.