: షారుఖ్ ఖాన్ పై నిషేధం ఎత్తివేత


ప్రముఖ బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీల్ ఫ్రాంఛైజీ అధినేత షారుఖ్ ఖాన్ కు ఊరట లభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా తనపై ఉన్న నిషేధాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎత్తివేసింది. గత మూడేళ్లుగా షారుఖ్ ఖాన్ ఈ నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. 2017 వరకు షారుఖ్ పై ఈ నిషేధం ఉన్నప్పటికీ, ఎంసీఏ నిషేధాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఈరోజు జరిగిన ఎంసీఏ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం సందర్భంగా, కమిటీలోని ఒక వర్గం షారుఖ్ ఖాన్ పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. ఎంసీఏ తీసుకున్న నిషేధం నిర్ణయాన్ని షారుఖ్ గౌరవించాడని, ఆనాటి నుంచి నేటి వరకు ఏ సందర్భంలో కూడా స్టేడియంలోకి ఆయన అడుగు పెట్టలేదని... అందువల్ల అతని ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని నిషేధాన్ని ఎత్తివేయాలని సదరు వర్గం విన్నవించింది. దీనికి ఇతర సభ్యులు కూడా సమ్మతి తెలపడంతో బాలీవుడ్ బాద్షాపై నిషేధం ఎత్తివేయడం జరిగింది.

  • Loading...

More Telugu News