: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో విద్యుత్ చౌర్యం... రూ. 2 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం


అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు అందుకుంటున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. విద్యుత్ ను అక్రమంగా వాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. హై టెన్షన్ లైన్ ఉన్న ఈ స్టేడియంలో మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే, గత రెండు నెలలుగా స్టేడియం విద్యుత్ బిల్లు చాలా తక్కువగా వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన విద్యుత్ అధికారులు స్థానిక విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో, గత రాత్రి స్టేడియంపై తనిఖీ అధికారులు దాడులు చేశారు. అక్కడున్న సిబ్బంది అధికారులను అడ్డుకోవడానికి యత్నించినప్పటికీ, వెనకడుగు వేయకుండానే దాడులు జరిపారు. ఈ సందర్భంగా, విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న విషయాన్ని గమనించారు. అనంతరం 'హెచ్ సీఏ'పై కేసు నమోదు చేశారు. దాదాపు రూ. 2 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News