: ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది: బీవీ రాఘవులు


రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈరోజు కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన జరిగేటప్పుడు పార్లమెంటులో మాట్లాడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు తన మాట తప్పుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాతపాటే పాడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News