: ఇండియాలోని వ్యభిచార గృహాల్లో 95 శాతం తెలుగు అమ్మాయిలే: పచ్చి నిజాన్ని వెల్లడించిన 'ప్రజ్వల'
ఇండియాలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఉన్న రెడ్ లైట్ ఏరియాల్లో తెలుగు అమ్మాయిలు మగ్గుతున్నారని 'ప్రజ్వల' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యభిచార గృహాల్లో ఉన్న వారిలో దాదాపు 95 శాతం మంది తెలుగు అమ్మాయిలే ఉండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. వ్యభిచార కూపాల్లో కూరుకుపోయిన వారిని రక్షించే నిమిత్తం 'ప్రజ్వల' ఓ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకుందని తెలిపారు. గత నెలలో మహారాష్ట్రలోని చాందీపూర్ లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ అధికారులు దాడులు చేసి 64 మందిని రక్షించిన సంగతి తెలిసిందే. మిగతా ప్రాంతాల్లోని వారిని కూడా కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని సునీతా వివరించారు. వీరంతా హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగా ఆయా ప్రాంతాలకు అక్రమంగా చేర్చబడ్డారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న పేద అమ్మాయిలకు వల వేసే కొందరు దుర్మార్గులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.