: రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వానికి నివేదికను అందించిన కమిటీ
నాగార్జున యూనివర్శిటీలో సీనియర్ విద్యార్థుల అరాచకాలు, ర్యాగింగ్ ను సహించలేక బలవన్మరణానికి పాల్పడిన రిషితేశ్వరి మృతిపై కేసు విచారణ కమిటీ ప్రాథమిక నివేదికను మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేసింది. హైదరాబాదులో మంత్రిని కలసిన కమిటీ ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఈ నివేదికను గంటాకు అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించారు. యూనివర్శిటీకి సెలవులు ఉండటంతో పూర్తి విచారణ కోసం మరో వారం రోజుల గడువు కోరారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల కొరత ఉండటంతో, ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించినట్టు తెలిపారు.