: టీడీపీలోకి కాంగ్రెస్ నేత డొక్కా... 15న ముహూర్తం!


మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశంలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీ మారేందుకు ఆగస్టు 15న ముహూర్తం కుదిరినట్టు సమాచారం. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్వయంగా మాట్లాడి డొక్కాకి లైన్ క్లియర్ చేశారని తెలుస్తోంది. కొంత కాలం క్రితం డొక్కా వైసీపీలో చేరుతారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో డొక్కాతో రాయపాటి చర్చలు జరిపి తెలుగుదేశంలో చేరేలా మనసు మార్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో డొక్కా వస్తే కలిగే లాభాలను చంద్రబాబుకు వివరించగా, ఆయన సైతం అంగీకరించినట్టు తెలిసింది. చంద్రబాబు టర్కీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ విషయమై పూర్తి సమాచారం వెలువడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News