: రెంటచింతలలో మరో 'రిషితేశ్వరి' ఘటన... నిందితులు హెచ్ఎం, ఆమె కూతురు ప్రత్యూష!


గుంటూరు జిల్లా రెంటచింతలలోని లూథరన్ బాలికల హైస్కూలులో మరో 'రిషితేశ్వరి' ఘటన తప్పిపోయింది. ఇక్కడి విద్యార్థినులు పాఠశాలలో జరుగుతున్న ఘోరాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాల హెడ్ మిస్ట్రెస్ లలితకుమారి, ఆమె కుమార్తె ప్రత్యూషల నుంచి వేధింపులు వస్తున్నాయి. బయటి వ్యక్తులతో చనువుగా ఉండాలని, ఫోన్లలో మాట్లాడాలని వీరు చెప్పేవారు. కాదంటే, విద్యార్థినులను అసభ్యకరంగా తిట్టేవారు. తాను చెప్పినవారితో చనువుగా ఉంటే పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేయిస్తానని హెచ్ఎం ప్రలోభ పెట్టేది. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు లలితకుమారి, ప్రత్యూష సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News