: వివాహిత ప్రియుడితో ఎలా జీవితాన్ని పంచుకోవాలో తెలియక...!
అతడి పేరు రహీం (28). గోదావరిఖనిలోని ఎన్టీపీసీ, అన్నపూర్ణ కాలనీకి చెందిన వాడు. పెళ్లయింది. భార్య గర్భవతి కూడా. అయితేనేం, ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అలేఖ్య (25)ను ప్రేమించాడు. అలేఖ్య కూడా రహీం అంటే ఇష్టపడింది. వీరిద్దరూ కలసి జీవించాలనుకున్నారు. అయితే, అందుకు మార్గం మాత్రం కనిపించలేదు. దీంతో గత రాత్రి తమ స్నేహితులకు విషయం చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్నేహితులు స్పందించి ఘటనా స్థలికి వచ్చి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రహీం మరణించగా, అలేఖ్య పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.