: లీడర్ ఎలా ఉండాలో చంద్రబాబు చూపించారు: మురళీమోహన్


గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాట ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న చినరాజప్ప నిర్ణయం తీసుకోగా, చంద్రబాబు వారించారట. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తాజాగా బయటపెట్టారు. తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన, సంక్షోభ సమయాల్లో నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు చూపించారని కొనియాడారు. జరిగిన సంఘటనకు బాధ్యత తనదేనని చంద్రబాబు ప్రజల ముందు అంగీకరించి క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పును మరొకరిపై తోసేసే ఈ రోజుల్లో, చంద్రబాబు ఆ పని చేయకుండా తానే బాధ్యుడినని స్వయంగా ప్రకటించుకుని, లీడర్ ఎలా ఉండాలో చూపించారని అన్నారు.

  • Loading...

More Telugu News