: డార్లింగ్స్... చాలా థ్యాంక్స్: ప్రభాస్


బాహుబలి చిత్రాన్ని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు హీరో ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రత్యేక వీడియోను పోస్టు చేశాడు. తనదైన శైలిలో ఫ్యాన్స్ ను 'డార్లింగ్' అని సంబోధిస్తూ, 'మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అభిమానులు బాహుబలి కోసం రెండున్నర సంవత్సరాలు వేచి చూశారు' అని ప్రభాస్ అన్నాడు. 23 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో "హాయ్ డార్లింగ్స్... ఐ జస్ట్ వాంట్ టూ సే థ్యాంక్స్. మీరు ఈశ్వర్ సినిమా నుంచి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేసి బాహుబలి చూశారు. ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హోప్ యూ ఎంజాయ్డ్ ది ఫిల్మ్... అండ్ ఐ జస్ట్ వాంట్ టూ సే థ్యాంక్స్. ధ్యాంక్స్ ఏ లాట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. పేరుపేరునా అందరికీ థ్యాంక్స్. ఐ లవ్ యూ" అని అన్నాడు.

  • Loading...

More Telugu News