: ఆవుల కడుపులో బాంబులు... బెడిసికొట్టిన మావోల కొత్త ప్లాన్!
మావోయిస్టులు కొత్త ప్లాన్ వేశారు. భారత సైన్యంపై దాడిని జరిపేందుకు ఆవుల కడుపులో బాంబులు అమర్చారు. సమయానికి సైన్యం వాటిని గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళితే, భారత్, నేపాల్ సరిహద్దుల వద్ద సుమారు 100 ఆవులు జవాన్ల కంటబడ్డాయి. వీటిని కాసేందుకు ఎవరూ లేకపోవడం, కొన్ని ఆవుల కడుపుపై కుట్లు కనిపించడంతో జవాన్లకు అనుమానం వచ్చింది. మెటల్ డిటెక్టర్లతో వాటిని తనిఖీలు చేసిన సైన్యం షాక్ తింది. వాటి కడుపులో నుంచి "టిక్ టిక్" మంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆవులనన్నింటినీ సమీపంలోని 'సహస్త్ర సీమా బల్' క్యాంపునకు తరలించిన సైన్యం, వాటికి ఎక్స్ -రేలు తీసి, మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేసి వీటి కడుపులో కొన్ని రకాల పేలుడు పదార్థాలు ఉన్నాయని గమనించారు. కాగా, ఈ ఘటనలో సంబంధముందని భావిస్తూ ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న సైనిక దళాలు వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఆవుల కడుపుల్లో బాంబులను మావోయిస్టులు అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.