: కలసి కల్లోలం సృష్టిద్దాం: తాలిబన్ల కొత్త నేత తొలి ఆడియో


ప్రపంచవ్యాప్తంగా జిహాదీలు కలసి పనిచేయాలని, విడివిడిగా ఉండటం వల్ల శత్రువుల బలం పెరుగుతుందని, దీంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్ల కొత్త నేత ముల్లా అక్తర్ మన్సూర్ తన తొలి ఆడియో సందేశంలో పేర్కొన్నాడు. తాలిబన్ల బలం తగ్గిందని జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, 33 నిమిషాల ఈ ఆడియో మెసేజ్ లో తెలిపాడు. "మన లక్ష్యం, నినాదం ప్రపంచవ్యాప్తంగా షరియా, ఇస్లామిక్ రాజ్య స్థాపన మాత్రమే. ఈ లక్ష్యం నెరవేరేదాకా మన పవిత్ర యుద్ధం కొనసాగుతుంది" అని ముల్లా అక్తర్ చెప్పాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతో శాంతి చర్చలను ప్రస్తావించిన ఆయన, ఆ విషయంలో తాలిబన్ల ఉద్దేశం ఏంటన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా, తాలిబన్ల నేత ముల్లా ఒమర్ మరణించాడని ఆప్ఘన్, అమెరికా ప్రభుత్వాలు స్పష్టం చేసిన తరువాత కొత్త నేతగా అక్తర్ ను నియమించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News