: మహంకాళి అమ్మవారికి మొక్కి టర్కీ బయలుదేరి వెళ్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి టర్కీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాదు నుంచి దుబాయి మీదుగా బాబు కుటుంబం ఇస్తాంబుల్ కు వెళ్లనుంది. టర్కీలో ప్రధాన నగరమైన ఇస్తాంబుల్ కు పర్యాటక కేంద్రంగా పేరున్న సంగతి తెలిసిందే. కాగా, చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఒక రోజు ముందుగానే టర్కీకి బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల పర్యటన అనంతరం ఈ నెల 8వ తేదీన చంద్రబాబు నగరానికి తిరిగి రానున్నారు. టర్కీ బయలుదేరి వెళ్లేముందు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు.