: ప్రభుత్వ సదుపాయాలు వద్దు: ఉత్తరాఖండ్ మాజీ సీఎం


మాజీ ముఖ్యమంత్రుల సౌకర్యాలపై చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన మరునాడే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, నివాసం తప్ప ఇతర సౌకర్యాలన్నింటినీ వదులుకుంటున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులకు కేవలం నివాససౌకర్యం మాత్రమే కల్పించాలని, కారు, సెక్యూరిటీ వంటి ఇతర సౌకర్యాలన్నీ తీసివేయాలని 1997లో చట్టం చేశారు. అయితే ఈ చట్టం అమలు కావడంలేదు. మాజీ ముఖ్యమంత్రుల సౌకర్యాలకు పెద్దమొత్తంలో ఖర్చు అవుతుండడంతో దీనిపై చట్టం చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నివాస సౌకర్యం మినహా అన్నింటినీ వదులుకుంటున్నానని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రకటించారు. అయితే బహుగుణ మాత్రమే ఇలా ప్రకటించారని, ఇతరులెవ్వరూ అలా చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News