: మోదీ పాలనపై పెదవి విరిచిన కారత్


ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఏమంత గొప్పగా లేదని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ పెదవి విరిచారు. గుంటూరులో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వ పాలనకంటే అధ్వానంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని అన్నారు. సామాన్య ప్రజలు జీవించే హక్కులను కూడా కేంద్రం హరించివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఆచరించడంలో యూపీఏని ఎన్డీయే మించిపోతోందని ఆయన విమర్శించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వాలు, దానిని మానేసి, సేకరణ పేరుతో రైతుల భూముల్ని కాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా భూసేకరణ బిల్లును అడ్డుకున్న బీజేపీ, అధికారంలోకి రాగానే బిల్లు తెస్తామని చెబుతోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News