: నేను సరదాగా ఉంటాను...అందర్నీ సరదాగా ఉంచుతాను: మహేష్ బాబు
సాధారణంగా తాను అందరితోనూ సరదాగా ఉంటానని మహేష్ బాబు చెప్పాడు. శ్రీమంతుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తాను మరీ సీరియస్ గా ఉండే టైపు కాదని అన్నాడు. సినిమా సెట్లో ఆర్టిస్టులు చాలా కష్టపడతారని, పాత్రను పోషించేందుకు టెన్షన్ పడతారని, అలాంటి వారిని సెట్లో భయపెట్టడం కంటే సరదాగా ఉంచడం ప్రధానమని అన్నాడు. సెట్లో ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా జోక్ లు వేసుకుంటూ, నవ్విస్తూ, నవ్వుతూ ఉంటానని మహేష్ బాబు చెప్పాడు. సీరియస్ గా ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణం పాడైపోతుందని మహేష్ బాబు అన్నాడు. తాను సరదాగా ఉంటాననే విషయం తనకు దగ్గరగా ఉండేవారికి బాగా తెలుసని తెలిపాడు. సెట్లో ఉంటే సందడి వాతావరణం ఉండాలని మహేష్ బాబు అభిప్రాయపడ్డాడు. అలాంటప్పుడే పాత్రలు పండుతాయని మహేష్ చెప్పాడు.