: సినిమాలో పాత్రలా నేనెలా ఉంటాను...పాత్ర పాత్రే...నేను నేనే: మహేష్ బాబు


సినిమాలో పాత్రలా తానెలా ఉంటానని మహేష్ బాబు ప్రశ్నించాడు. శ్రీమంతుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శ్రీమంతుడు సినిమాలో హర్షకు, నిజజీవితంలో మహేష్ బాబుకు పోలికలు ఉన్నాయా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కేవలం సినిమాల కోసమే పాత్రలు రూపొందిస్తారని ఆయన చెప్పారు. సినిమా పాత్రల్లా నిజజీవితంలో ఉండడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు. సినిమా పాత్ర పాత్రే, తాను తానేనని మహేష్ బాబు సమాధానమిచ్చాడు. అయినా మనం ఇంకొకరిలా ఉండాలని అనుకోవడం సరైనదని తాను భావించనని మహేష్ బాబు తెలిపాడు. అయితే శ్రీమంతుడు సినిమాలో హర్ష పాత్ర కోసం కొంత కష్టపడ్డానని మహేష్ బాబు చెప్పాడు. అయితే ట్రైలర్ ను ఆదరించడం ద్వారా తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని మహేష్ బాబు చెప్పాడు. అభిమానులను సినిమా అలరిస్తుందని మహేష్ బాబు ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News