: ప్రత్యేకహోదాపై పురందేశ్వరి, హరిబాబును నిలదీసిన కార్యకర్తలు


విశాఖపట్టణంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిద్ధార్థ్ నాథ్ సింగ్, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ప్రత్యేకహోదాపై కార్యకర్తలు నిలదీశారు. పార్టీ ఉద్దేశం ఏంటో స్పష్టం చేయాలని అడిగారు. కార్యకర్తలు నిలదీయడంతో ఇబ్బంది పడ్డ బీజేపీ నేతలు స్పందిస్తూ, ప్రత్యేకహోదాపై వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజల్లో తిరగలేమని వారు తెలిపారు. ప్రత్యేకహోదా వస్తుందని వారు హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు శాంతించారు.

  • Loading...

More Telugu News