: కూల్చాల్సింది చార్మినార్ ను కాదు...కేసీఆర్ ని: ఎర్రబెల్లి
కాలం చెల్లితే చార్మినార్ నైనా కూల్చేస్తామంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడుతూ, కూల్చాల్సింది చార్మినార్ ను కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నని అన్నారు. చార్మినార్ లాంటి కట్టడాలు హైదరాబాదుకు తలమానికమని, అలాంటి కట్టడాలను చారిత్రక సంపదగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది మూర్ఖపు ఆలోచన అని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ హామీలు పది లక్షల కోట్ల రూపాయలకు చేరాయని ఆయన గుర్తు చేశారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను, నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.