: డీఈవోను సస్పెండ్ చేసి, ఆంక్షలు విధించిన తెలంగాణ
వరంగల్ జిల్లా డీఈవోను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో తెలంగాణ విద్యాశాఖలో కలకలం రేగింది. ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో డీఈవో చంద్రమోహన్ ను సస్పెండ్ చేసినట్టు సమాచారం. సస్పెండ్ చేసిన అనంతరం ఆయన జిల్లా విడిచి వెళ్లకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాగా, ఉపాధ్యాయుల బదిలీల్లో పైరవీలు సర్వసాధారణమని, పార్టీ నేతలు ఫిర్యాదు చేసినంత మాత్రాన సస్పెండ్ చేయడం సబబు కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.