: రాజీవ్ ఖేల్ రత్నకు సానియా పేరు ప్రతిపాదన... గడువు ముగిశాక సిఫారసు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ఆమె పేరును పరిశీలించాలంటూ అవార్డుల కమిటీకి మంత్రి సోనావాల్ పంపారు. గత రెండు,మూడేళ్ల నుంచి అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా పలు ట్రోఫీలు గెలుచుకుంది. ఇటీవలే మహిళల డబుల్స్ లో మార్టినా హింగస్ తో కలసి వింబుల్డన్ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది. అంతకుముందే టెన్నిస్ లో తొలిర్యాంకులో కూడా నిలిచింది. ఈ నేపథ్యంలోనే సానియా పేరును ఖేల్ రత్నకు సిిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పురస్కారానికి దాఖలు చేసేందుకు విధించిన 60 రోజుల సమయాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఇప్పటికే కోల్పోయింది. మరి క్రీడా శాఖ ఎందుకిప్పుడు ఇలా చేసిందో ప్రశ్నార్ధకంగా ఉంది.