: తెలంగాణలో ఏపీ స్థానికత విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కేంద్రానికి ఏపీ సీఎస్ లేఖ


హైకోర్టు ఆదేశించినా, కేంద్ర ప్రభుత్వం సూచించినా ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడం లేదు. దాంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన విద్యుత్ ఉద్యోగులను తీసుకోకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు. 1,253 మంది ఉద్యోగులను రిలీవ్ చేయడం సరికాదని చెప్పారు. ఉద్యోగులకు న్యాయం చేసే అంశంలో కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని, ఉద్యోగులను వారి స్థానాల్లో నియమించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News