: అప్పట్లో నాన్న గారు 'శ్రీమంతుడు'కి పనిచేశారు...మహేష్ బాబుతో ఇప్పుడు నేను చేశాను!: శ్రుతి హాసన్
గతంలో ఏఎన్నార్ నటించిన 'శ్రీమంతుడు' సినిమాకు తన తండ్రి కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేశారని, ఇప్పుడు మహేష్ బాబుతో తాను చేసిన సినిమా కూడా 'శ్రీమంతుడు' కావడం ఆనందంగా వుందని హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ తో శ్రుతి మాట్లాడుతూ, తన తండ్రి పనిచేసిన 'శ్రీమంతుడు' అప్పట్లో అందర్నీ అలరించిందని గుర్తు చేసింది. మహేష్ బాబు 'శ్రీమంతుడు' కూడా ఆకట్టుకుంటుందని తెలిపింది. ఇప్పటికే ఆడియో మంచి ఆదరణ పొందిందని తెలిపింది. సెట్లో మూడీగా ఉండడం తనకు నచ్చదని, మహేష్ బాబుతో సెట్లో సందడే సందడని తెలిపింది. మహేష్ బాబు సింపుల్ గా ఉంటారని శ్రుతి కితాబిచ్చింది. 'శ్రీమంతుడు' సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పింది.