: ఇక సమరమే... మీరు సిద్ధంగా ఉండండి!: ప్రత్యేక హోదాపై రఘువీరాకు రాహుల్ ఫోన్


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన రఘువీరాతో చర్చించారు. ప్రత్యేక హోదా సాధించుకోవడం ఏపీ హక్కు అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయమై ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశం కావాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయం రఘువీరాకు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జాతీయస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఏపీ కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలని రాహుల్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News