: స్మృతీ ఇరానీని 'పనిమనిషి' అనలేదు: కామత్


కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని తాను 'పనిమనిషి' అని పేర్కొనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గురుదాస్ కామత్ అన్నారు. తాను కేవలం ఆమె మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లో పనిచేసిందన్న విషయాన్నే ప్రస్తావించానని తెలిపారు. 'ద ఏషియన్ ఏజ్' మీడియాతో మాట్లాడుతూ... రాజస్థాన్ సభల్లో తానెప్పుడూ స్మృతీ ఇరానీని 'పనిమనిషి' అని వ్యాఖ్యానించలేదని, ఆమె కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. టీవీ స్టార్ గా ఎదగకముందు ఆమె కష్టాలనెదుర్కొన్న రోజుల గురించే మాత్రమే మాట్లాడానని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News