: యాదాద్రి చుట్టుపక్కల చెరువుల అభివృద్ధికి నిర్ణయం... రూ.16.59 కోట్ల నిధుల మంజూరు


యాదాద్రి (యాదగిరి గుట్ట) అభివృద్ధిలో భాగంగా దాని చుట్టూ ఉన్న చెరువులను కూడా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గుట్ట చుట్టూ ఉన్న నాలుగు చెరువులను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అందుకోసం ప్రభుత్వం నుంచి రూ.16.59 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇవ్వాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాలన్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ ప్రత్యేక అధికారి కిషన్ రావు, నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. గుట్ట అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై వారితో కలసి చర్చించారు.

  • Loading...

More Telugu News