: ఉస్మానియాను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు... సర్కారుపై పోరుకు సై


హైదరాబాదులోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా ఆసుపత్రిని తరలించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి రాష్ట్రానికే తలమానికమని, అలాంటి ఆసుపత్రి భవనాలను కూల్చివేయాలని నిర్ణయించడం సరికాదని అన్నారు. టెక్నికల్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. హనుమంతరావు, దానం నాగేందర్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు శనివారం ఉస్మానియా ఆసుపత్రి భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతను సర్కారు విరమించుకోవాలని తెలిపారు. లేదంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News