: ఇంతకంటే గొప్ప బాస్ మరెవ్వరు?


ఒకప్పుడు సంస్థల్లో అధిపతులకు, ఉద్యోగులకు మధ్య ఎంతో ఎడం ఉండేది. కాలగమనంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఉద్యోగులతో మమేకం అయ్యేందుకు యాజమాన్యాలు మొగ్గుచూపుతున్నాయి. వారితో సన్నిహితంగా ఉంటూ, స్నేహభావంతో వ్యవహరించడం ద్వారా మెరుగైన ఉత్పాదకత రాబట్టుకోవచ్చన్నది మేనేజ్ మెంట్ సూత్రంగా మారిపోయింది. ఈ సూత్రాన్ని కాస్తంత ఎక్కువే ఒంటబట్టించుకున్నాడు నెవ్జాట్ అయిడిన్. టర్కీ స్టార్టప్ యెమెక్సెపేటి సంస్థకు అయిడిన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు. ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థను ఓ జర్మనీ సంస్థ 589 మిలియన్ డాలర్లు (రూ.3768 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. అయిడిన్ కు తమ ఎగ్జిక్యూటివ్ బోర్డులో స్థానం కల్పించిన ఆ జర్మనీ సంస్థ, యెమెక్సెపేటికి సీఈఓగా ఆయననే నియమించింది. అదలావుంచితే... తన కంపెనీలో ఉద్యోగులను మరింత ఉత్తేజపరిచేందుకు అయిడిన్ ఏంచేశాడో చూడండి! తన రూ. 172 కోట్ల సంపదను ఉద్యోగులకు పంచాలని నిర్ణయించాడు. నిజంగా గొప్ప బాసే కదూ! పంచుకోవడంలోనే ఆనందం ఉంటుందని తరచూ చెబుతుంటాడు అయిడిన్. టీమ్ వర్క్ ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, టీమ్ లోని మిగతా వారితో పంచుకున్నప్పుడే సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేయగలమన్నది ఈ సూపర్ బాస్ నిశ్చితాభిప్రాయం.

  • Loading...

More Telugu News