: బీజేపీ నేతల 'చలో సెక్రటేరియట్' ఉద్రిక్తత... కిషన్ రెడ్డి సహా నేతల అరెస్ట్
మునిసిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ తెలంగాణ శాఖ చేపట్టిన 'చలో సెక్రటేరియట్' ఉద్రిక్తంగా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ల నేతృత్వంలో పార్టీ నేతలు, మునిసిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో సచివాలయ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.