: టీఆర్ఎస్ ను కార్మికులు జాడుకట్టతో సమూలంగా ఉడ్చేస్తారు: కిషన్ రెడ్డి
సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాకు బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మద్దతు తెలిపారు. సమ్మె చేశారని కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేసి రోడ్డుపైకి నెట్టడం సీఎం కేసీఆర్ కు న్యాయం కాదన్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే టీఆర్ఎస్ పార్టీని కార్మికులే పెద్దజాడుకట్టతో హైదరాబాద్ నుంచి సమూలంగా ఊడ్చివేస్తారని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కార్మికుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందన్నారు. కార్మికుల సమస్యలపై పలుమార్లు సీఎంను కలవాలని ప్రయత్నించానని, అయినా తమకు సమయం కేటాయించడం లేదని చెప్పారు.