: ఇంతకంటే ఇంకేం చేయాలి?: మీడియాపై రాయపాటి అసహనం
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదంటూ కేంద్రం చేసిన ప్రకటన ఏపీలో అధికార పక్ష నేతలకు మింగుడుపడడంలేదు. మంత్రులు మాత్రం ఆశావాదం కనబరుస్తుండగా, ఎంపీలు మాత్రం భిన్న స్వరం వినిపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అందరికీ అర్థమైందని, ఇక నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతాయని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొనడం తెలిసిందే. అటు, కేంద్రం ప్రకటనపై విజయవాడలో విలేకరులు ప్రశ్నించగా రాయపాటి సాంబశివరావు సహనం కోల్పోయారు. ప్రత్యేక హోదాపై ఇంతకంటే ఇంకేం చేయాలి? బట్టలూడదీసుకుని తిరగాలా? అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బీజేపీకి ఇష్టంలేదని అన్నారు. ఈ విషయంలో బీజేపీ మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.