: నైట్ పార్టీలకు నేనెప్పుడూ వెళ్లలేదు.. విచారణ కమిటీ ముందు ‘నాగార్జున’ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతున్న బాలసుబ్రహ్మణ్యం కమిటీ ముందు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు హాజరయ్యారు. రిషితేశ్వరిపై సీనియర్ల వేధింపులకు సంబంధించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై బాబూరావు స్పందించలేదన్న ఆరోపణలున్నాయి. అంతేకాక విద్యార్థులతో నైట్ పార్టీల్లో ఆయన మునిగితేలిన వీడియోలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనపై సస్పెన్షన్ వేటు వేసేలోగానే తానే ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసేశారు. నేటి ఉదయం ఆయన కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ‘‘నైట్ పార్టీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. విద్యార్థుల బలవంతం మేరకు ఫ్రెషర్స్ డే వేడుకలకు మాత్రమే హాజరయ్యాను’’ అని ఆయన వాంగ్మూలమిచ్చారు.