: సాయంత్రం హస్తినకు టీ పీసీసీ చీఫ్... ఉస్మానియాలో రాహుల్ పర్యటన ఖరారయ్యే అవకాశం


తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఇటీవలి కీలక పరిణామాలపై ఆయన సమగ్ర వివరాలతో విమానమెక్కనున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతలతో ఉత్తమ్ వరుస భేటీలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక ఈ నెలలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ను కూడా ఉత్తమ్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News