: రిషితేశ్వరి కేసులో విచారణకు హాజరైన ప్రిన్సిపాల్ బాబూరావు
బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో లీగల్ సెల్ అథారిటీ ముందు విచారణకు ప్రిన్సిపాల్ బాబూరావు ఈరోజు హాజరయ్యారు. ఆయనతో పాటు హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి కూడా విచారణకు వచ్చారు. విద్యార్థిని ఆత్మహత్య, ర్యాగింగ్ అంశాలపై నాగార్జున విశ్వవిద్యాలయంలో వారిద్దరినీ ప్రశ్నించారు. విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబూరావు కొన్ని రోజుల కిందటే రాజీనామా చేశారు. ఆయనవల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థుల నుంచి ఆరోపణలు వస్తుండటంతో ఆయనను అరెస్టు చేయాలని పలు రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.