: బీహార్ కు ప్రత్యేక హోదా నిరాకరించిన కేంద్రంపై దుమ్మెత్తిపోసిన జేడీ (యూ)


ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమన్న కేంద్రం ప్రకటన పలు రాష్ట్రాలను తీవ్ర నిరాశలో ముంచేసింది. ఎప్పటినుంచో తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న బీహార్ వంటి రాష్ట్రాలైతే అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఈ విషయమై అధికార జేడీ (యూ) కేంద్రంపై దుమ్మెత్తిపోసింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీ ఇచ్చిన మోదీ ఇప్పుడు మాటమార్చారని జేడీ (యూ) మండిపడింది. ఎన్నికల్లో నెగ్గేందుకు బీహార్ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టింది. యూపీఏ హయాంలోనూ తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై అభ్యర్థించామని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ మెమొరాండం కూడా సమర్పించామని జేడీ (యూ) నేత కేసీ త్యాగి తెలిపారు. కేంద్రం తాజా ప్రకటనలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీలతో ఏమీ ఒరగదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News