: ఆ హైదరాబాదీలు ఐఎస్ చెరలో ఉన్నారా? విడుదలయ్యారా?... తొలగని సందిగ్ధత


లిబియాలో ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన నలుగురు భారతీయుల్లో ఇద్దరు హైదరాబాదీలున్న సంగతి విదితమే. అయితే, వారి క్షేమంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. వారు విడుదలయ్యారని శుక్రవారం సాయంత్రం వార్తలు వచ్చినా, దానిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్, లక్ష్మీపతి ఐఎస్ చెర నుంచి బయటపడి తమవారికి ఫోన్ చేసినట్టు తెలిసింది. దాంతో, హైదరాబాదుకు చెందిన బలరామ్, గోపీకృష్ణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక వ్యక్తులు మాత్రం విడుదలయ్యారని కేంద్రం తెలపడంతో తమ వారి యోగక్షేమాల పట్ల బలరామ్, గోపీకృష్ణ బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News