: యాకూబ్ ను ఉరితీయడంపై బాధపడుతున్న కాంగ్రెస్ నేతలు అప్పుడెక్కడికెళ్లారు?: అరుణ్ జైట్లీ
యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేయడంపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలంటే ఉరిశిక్షలు తప్పవని స్పష్టం చేశారు. యాకూబ్ ను ఉరితీయడం తమను బాధించిందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అప్పట్లో ఇందిరా గాంధీ హత్య కేసులో దోషులను ఉరి తీస్తున్నప్పుడు వారు ఎక్కడికెళ్లారని జైట్లీ సూటిగా ప్రశ్నించారు. ముంబయి పేలుళ్ల కేసులో ఇంకా కొందరు దొరకాల్సి ఉందని, వారిని కూడా యాకూబ్ తరహాలో ఉరితీయక తప్పదని, మున్ముందు మరిన్ని ఉరితీతలు ఉంటాయని తెలిపారు. సాధారణంగా ఎవరూ కూడా మరణశిక్షను ఇష్టపడరని అన్నారు. ఎవరికైనా మరణశిక్ష విధించేటప్పుడు కోర్టులు వివేచన ప్రదర్శిస్తాయని పేర్కొన్నారు.