: రోడ్డు ప్రమాదంలో కొండపి ఎమ్మెల్యేకు గాయాలు... ఆసుపత్రికి తరలింపు


కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కొండపి నుంచి ఒంగోలు వస్తుండగా ఆయన కారును మరో కారు ఢీకొన్నది. దీంతో, ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఒంగోలు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News