: ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీకి కలాం పేరు ఖాయం
విజయవాడలో నిర్వహించిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం, మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. నాగార్జున యూనివర్శిటీలో కలాం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అంతేగాకుండా, రాష్ట్రంలో విద్యార్థులకు ప్రదానం చేసే ప్రతిభా అవార్డులను కలాం పేరుతో ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ఇక, అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.